arrest : బస్సులో అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు అరెస్టు

బస్సులో అత్యాచారం ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, నిందితున్ని ఇరవై నాలుగు గంటల్లో అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-07-31 11:50 GMT

దిశ, సికింద్రాబాద్ : బస్సులో అత్యాచారం ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, నిందితున్ని ఇరవై నాలుగు గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హాజరై వివరాలను వెల్లడించారు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు నిర్మల్ నుంచి పామూరుకు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు డ్రైవర్లు ఈర్ల కృష్ణ బాబు, రామగిరి సిద్ధయ్యలతో బయల్దేరింది. అదే బస్సులో బాధితురాలు తన ఎనిమిదేళ్ల కుమార్తెతో

    కలిసి బెర్త్ నెంబర్ 1 లో ప్రయాణం చేస్తుంది. రాత్రి పదిన్నర గంటల సమయంలో మెదక్ జిల్లా చేగుంట సమీపంలో భోజనం కోసం బస్సును నిలిపారు. ఆ సమయంలో ప్రయాణికులందరూ భోజనం కోసం బస్సు దిగారు. తిరిగి బస్సు ప్రారంభమయ్యే సమయంలో బస్సు డ్రైవర్ కృష్ణ బాధితురాలి దగ్గరకు వచ్చి బెర్త్ నెంబర్ 5, 6కు వెళ్లాలని సూచించడంతో ఒకే బెర్పై తన కూతురితో కలిసి పడుకోవడం ఇబ్బందిగా ఉంటుందని తనకు వేరే బెర్త్ కేటాయిస్తున్నారని భావించిన ఆమె ఆ బెర్త్​ మారింది. బస్సు ప్రయాణం తిరిగి ప్రారంభం కావడంతో ఆ బెర్పై

    ఆమె తన కూతురితో సహా పడుకుంది. బాధితురాలు నిద్రలోకి వెళ్లిన సంగతి గమనించిన కృష్ణ ఆమె మంచి గాఢనిద్రలో ఉండగా బెడ్ షీట్ బలవంతంగా నోట్లో కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలతో మరో డ్రైవర్ సిద్ధయ్య సహాయంతో కృష్ణ పరారయ్యాడు. తోటి ప్రయాణికుల సహాయంతో బాధితురాలు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బస్సును నిలిపి బాధితురాలిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశంలో ఏసీపీ గ్యార జగన్, సీఐ ఎన్. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 

Read More..

Bihar: తుపాకీతో ఐదేళ్ల చిన్నారి ఆట.. పదేళ్ల బాలుడిపై కాల్పులు 

Tags:    

Similar News