BREAKING: మెదక్ జిల్లాలో ఘరానా మోసం.. సీఐడీ అధికారులమంటూ దారి దోపిడీ
మెదక్ జిల్లాలో పట్టపగలే ఇవాళ దొంగలు హల్‌చల్ సృష్టించారు.
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో పట్టపగలే ఇవాళ దొంగలు హల్‌చల్ సృష్టించారు. సీఐడీ అధికారులమంటూ బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేగుంటకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు రామచంద్రం బైక్‌పై హైదరాబాద్ బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో కొందరు ఆగంతకులు తాము సీఐడీ అధికారులమంటూ అతడి బైక్‌ను ఆపారు. అనంతరం రామచంద్రం వద్ద ఉన్న బంగారు ఉంగరాలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో రామచంద్రం ఏం చేయాలో తెలియక హుటాహుటిన సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.