Crime : సినిమాను తలపించే సీన్...హత్యకు గురైన వ్యక్తి ఒంటిపై నిందుతుల పేర్లు

ముంబై నగరంలో సినిమాను తలపించే సీన్ చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి ఒంటిపై నిందితుని పేరు పచ్చబొట్టుగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-07-26 15:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : ముంబై నగరంలో సినిమాను తలపించే సీన్ చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి ఒంటిపై నిందితుల పేర్లు పచ్చబొట్టుగా ఉండటంతో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని గురు వాఘ్ మారే అనే వ్యక్తి హత్యకు గురైయ్యాడు. వాఘ్ మారే గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా..మృతిని ఒంటిపై పచ్చబొట్టతో ఉన్న 22 మంది పేర్లు గుర్తించారు.

అందులో 22 మంది వ్యక్తుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని పేర్కొన్నాడు. అయితే నిజంగానే ఇందులో ఉన్న వ్యక్తులు స్పా సెంటర్ లోకి ప్రవేశించి తన గర్ల్ ఫ్రెండ్ ని వేరే గదిలో బందించి, వాఘ్ మారేను కత్తెర, బ్లేడ్ లను ఉపయోగించి హత్య చేశారు. ఈ విషయం గమనించిన పోలీసులు స్పా యజమాని సంతోష్ షేరేకర్ తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా వాఘ్ మారే సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ 2010 నుంచి ముంబై, థానే, పాల్ఘర్ లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడని, అతనిపై గతంలో దోపిడీ, అత్యాచారం, వేధింపులు, క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.


Similar News