రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఫ్యాషన్ డిజైనర్.. షాపింగ్ మాల్‌లోనే రచ్చరచ్చ!

ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలకు పెళ్లి, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఇలా ఏదీ అడ్డురావడం లేదు.

Update: 2024-07-22 14:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలకు పెళ్లి, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఇలా ఏదీ అడ్డురావడం లేదు. చట్టాపట్టాల్ వేసుకుని తిరిగామా.. శారీరక సుఖం తీర్చుకున్నామా లేదా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. పెళ్లై పిల్లలు ఉన్న పురుషులతో యువతులు, వివాహితలతో యువకులు ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకుంటూ కుటంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. బజారున పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచి పేరున్న ఓ ఫ్యాషన్ డిజైనర్ పెళ్లైన పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం ఓ షాపింగ్ మాల్ వేదికగా బయటపడింది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బేగంపేటకు చెందిన శ్యాంసుందర్ బోనగాని అనే వ్యక్తి HDFC సెక్యూరిటీ క్లస్టర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు పెళ్లై 15 సంవత్సాలు అయింది. భార్య, పిల్లలు ఉన్నారు. అయితే శ్యాంసుందర్‌కు అదే ప్రాంతానికి చెందిన లేడీ ఫ్యాషన్ డిజైనర్‌తో పరిచయం అయింది. కొద్దిరోజుల్లోనే అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎక్కువ సమయం ఫ్యాషన్ డిజైనర్‌తో సమయం గడుపుతున్నాడు శ్యాంసుందర్. భర్తపై అనుమానం వచ్చిన భార్య సోమవారం ఉదయం ఫాలో అయింది. ఇది గమనించని శ్యాంసుందర్‌ తన ప్రియురాలిని తీసుకోని బేగంపేట మెట్రో స్టేషన్ పక్కన ఉన్న లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. అక్కడ చిలుకా గోరింకల్లా తిరుగుతూ షాపింగ్ చేయడం ప్రారంభించారు.

ఇదే అదునుగా భావించిన శ్యాంసుందర్‌ భార్య తన బంధువులు, స్నేహితులతో కలిసి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్య స్కెచ్‌కు ఖంగుతిన్న శ్యాంసుందర్‌.. ఆ తర్వాత తేరకోని రివర్స్ అయ్యాడు. అసలు నువ్వు ఎవరివో తెలియదంటూ బుకాయించాడు. తన స్నేహితురాలితో కలిసి షాపింగ్‌కు వచ్చానని.. జనం మధ్యలో న్యూసెన్స్ చేయవద్దని భార్యను హెచ్చరించి అక్కడి నుంచి జారుకున్నాడు. సదరు ఫ్యాషన్ డిజైనర్ సైతం అలాగే బుకాయించింది. మేమిద్దరం స్నేహితులమని, తమ మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. తోటి కస్టమర్ల ఎదుట గొడవలు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శ్యాంసుందర్‌ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త శ్యాంసుందర్‌, ఫ్యాషన్ డిజైనర్ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఆమె వల్లనే తన భర్త నాకు, నా పిల్లలకు దూరంగా ఉంటున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. కాగా, ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Read More..

BREAKING: అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ల ముఠా అరెస్ట్.. భారీ ఎత్తున డ్రగ్స్, ఎండీఎంఏ స్వాధీనం 

Tags:    

Similar News