25 కేజీల గంజాయి పట్టివేత

ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ రైల్వే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జి ఆర్ పి రైల్వే ఇన్స్పెక్టర్ కే.వెంకటరావు ఆధ్వర్యంలో ఆదివారం జి ఆర్ పి ఎస్ఐ వి.రవివర్మ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్, పలు రైలుబండ్లలో తనిఖీ చేస్తుండగా 25.4 కిలోల గంజాయి

Update: 2024-03-10 13:24 GMT

దిశ ప్రతినిధి, విజయనగరం:ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ రైల్వే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జి ఆర్ పి రైల్వే ఇన్స్పెక్టర్ కే.వెంకటరావు ఆధ్వర్యంలో ఆదివారం జి ఆర్ పి ఎస్ఐ వి.రవివర్మ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్, పలు రైలుబండ్లలో తనిఖీ చేస్తుండగా 25.4 కిలోల గంజాయి పట్టుబడినట్లు జి ఆర్ పి ఇన్స్పెక్టర్ వెంకటరావు తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమిత్ర బడైక్,రేఖమ కముడిలను అరకు రైల్వే స్టేషన్ మీదుగా విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించేందుకు కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వెంకటరావు తెలిపారు.


Read More..

శివరాత్రి వేడుకల్లో అపశృతి – బాలిక దుర్మరణం 

Tags:    

Similar News