గోశాల యజమాని, సూపర్వైజర్ వేధింపులకు వర్కర్ ఆత్మహత్య...
శ్రీ శుభంకరి వృద్ధ గోశాల యజమాని, సూపర్వైజర్ వంజరి శ్రీనివాస్ వేధింపులకు గోశాలలో పనిచేస్తున్న మూడవత్ లాల్య అలియాస్ లాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో శనివారం వెలుగు చూసింది.
దిశ, కౌడిపల్లి : శ్రీ శుభంకరి వృద్ధ గోశాల యజమాని, సూపర్వైజర్ వంజరి శ్రీనివాస్ వేధింపులకు గోశాలలో పనిచేస్తున్న మూడవత్ లాల్య అలియాస్ లాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కుషన్ గడ్డ తండాకు చెందిన మూడవత్ లాల్య (48) రెండు సంవత్సరాల నుంచి శ్రీ శుభంకరి వృద్ధ గోశాలలో పశువులను మేపడానికి పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం గోశాల యజమాన్యం లాల్యాను పని నుంచి తొలగించారు.
కుటుంబ సభ్యులు పనిలోకి తీసుకోవాలని కోరగా తిరిగి 8 రోజుల క్రితం పనిలో పెట్టుకున్నారు. గోశాల యజమాని, సూపర్వైజర్ ఇరువురు కలిసి బాధితున్ని పని విషయంలో ఇబ్బందులకు గురి చేయడంతో భార్య బుజ్జికి చెప్తూ బాధపడేవాడని తెలిపారు. ఈ నెల 8వ తేదీ రాత్రి పనికి వెళ్ళి తిరిగి ఉదయం ఇంటికి రాలేదు. భార్య కుటుంబ సభ్యులు గోశాల వద్దకు వెళ్లి చూడగా గోశాల ఆవరణలో ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ ఉన్న లాల్య మృతదేహం కనిపించింది. భర్త మరణం పై గోశాల యజమాని, సూపర్వైజర్ వంజరి శ్రీనివాసుల పై వ్యక్తం చేస్తూ మృతుని భార్య బుజ్జి శనివారం కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.