కుటుంబ కలహాలతో మహిళ మృతి...పోలీస్ స్టేషన్ ముందు బంధువుల ఆందోళన
కుటుంబ కలహాలతో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన గురువారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ బాయ్ తండాలో చోటుచేసుకుంది.
దిశ, మహేశ్వరం: కుటుంబ కలహాలతో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన గురువారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ బాయ్ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు,సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...మహేశ్వరం మండలం మైలార్ బాయ్ తండాకు చెందిన కేతావత్ సంతోష(25)కు 2019 సంవత్సరంలో కందుకూరు మండలం పెద్దమ్మ తండాకు చెందిన సభావత్ సంతోష్(30) తో వివాహం జరిగింది. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ పెద్దలు పలుమార్లు సంతోష్ కు నచ్చజెప్పిన సంతోష్ తీరులో ఎటువంటి మార్పు రాలేదని తెలిపారు. సంతోష్ తీరు మారకపోవడంతో ఈ నెల 24వ తేదీన మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో సంతోష ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన సంతోష్ తీరు మారకపోగ సంతోష మృతి చెందింది. దీంతో సంతోష మృతదేహంతో కుటుంబ సభ్యులు మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.