మైనర్ బాలుడి రేప్ కేసులో వ్యక్తికి మరణ శిక్ష
ఓ మైనర్ బాలుడిని రేప్ చేసి అనంతరం హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి మరణ శిక్ష పడింది.
దిశ, వెబ్ డెస్క్: ఓ మైనర్ బాలుడిని రేప్ చేసి అనంతరం హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి మరణ శిక్ష పడింది. నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఉత్తరప్రదేశ్ లోని మథుర పోక్సో కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 9వ తేదీన తన మైనర్ కుమారుడు కనిపించడం లేదంటూ మథురలోని ఔరంగాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సదార్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. కాన్పూర్ కు చెందిన మహ్మద్ సైఫ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో సైఫ్ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.
తనకు మైనర్ బాయ్స్ తో లైంగికంగా కలవడం ఇష్టమని, ఈ క్రమంలోనే సదర్ మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్లి రేప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం విషయం బయటకు వస్తుందనే భయంతో ఆ బాలుడిని చంపేసి శవాన్ని అరకిలోమీటర్ దూరంలో ఉన్న డ్రైనేజీలో పడవేసినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే 363, 302, 201, 377 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం ఈ కేసును విచారించిన పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి రామ్ కిషోర్ యాదవ్.. నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అలాగే రూ.లక్ష జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా కేసు ట్రయల్ ను 15 రోజుల్లోనే మథుర పోక్సో కోర్టు పూర్తి చేసి నిందితుడికి శిక్ష వేసింది.