దారి దోపిడీకి విఫలయత్నం

మండల కేంద్రంలోని వైన్స్ లో పనిచేసే యువకుడిని వెంబడించి దారి దోపిడీకి యత్నించారని గుడిహత్నూర్ ఎస్సై మహేందర్ తెలిపారు.

Update: 2024-12-26 12:44 GMT

దిశ,గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని వైన్స్ లో పనిచేసే యువకుడిని వెంబడించి దారి దోపిడీకి యత్నించారని గుడిహత్నూర్ ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వైన్స్ లో పనిచేసే బండి సురేష్ బుధవారం రాత్రి వైన్స్ ను బంద్ చేసి డబ్బులతో ఇంటికి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అతనిని వెంబడించి జాతీయ రహదారిపై మండల కేంద్రానికి సమీపంలో గల వంతెన వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆపి అతనిపై దాడి చేశారు. అతని వద్ద ఉన్న డబ్బును దోచుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. దొంగలు పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. 


Similar News