స్కూల్లో క్షుద్రపూజల కలకలం.. సీసీ ఫుటేజ్ మాయం..?
సైన్స్, టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్ మహానగరంలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : సైన్స్, టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్ మహానగరంలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. అది కూడా ఓ పాఠశాలలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజేందర్ నగర్‌లోని ఓ స్కూల్లోని సైన్స్ ల్యాబ్, స్టోర్ రూంలో గుర్తు తెలియని దుండగులు ఈ పూజలు చేశారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన సిబ్బంది ఆ దృశ్యాలను చూసి భయాందోళనకు గురయ్యారు. మరోవైపు స్కూల్‌లో ఉండాల్సిన సీసీ టీవీ ఫుటేజ్ మాయం కావడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More....