ఇద్దరు వైర్ల దొంగలు అరెస్ట్

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ మండలం తొగర్రాయి సబ్ స్టేషన్ పరిధిలో స్తంభాల వైర్లు ధ్వంసం అయ్యాయి.

Update: 2024-09-27 15:32 GMT

దిశ, కోదాడ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ మండలం తొగర్రాయి సబ్ స్టేషన్ పరిధిలో స్తంభాల వైర్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ సరఫరా కోసం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి కోదాడ ఏడీ కండక్టర్ వైరు, ఏబీ కేబుల్ తెప్పించి కాంట్రాక్టర్ల ద్వారా పనిచేయిస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన వైరు మొత్తం కోదాడ మండలం తొగర్రాయి సబ్ స్టేషన్ పరిధిలో భద్రపరిచారు. ఇదే అదునుగా భావించిన వెల్దండ గ్రామానికి చెందిన దాసరి వంశీ, తొగర్రాయి గ్రామానికి చెందిన నామాల వీరబాబు కలిసి సబ్ స్టేషన్ లోని కండక్టర్ వైరు, ఏబీ కేబుల్ (విలువ 1,10,000) దొంగిలించారు.

    వీరబాబు కు ఆటో ఉండటంతో ఆటోలో తరలించి ఆయన ఇంట్లో దాచిపెట్టారు. శుక్రవారం వంశీ, వీరబాబు ఆ కేబుల్ అమ్మటానికి ఆటోలో విజయవాడకు వెళ్తుండగా ఉదయం నల్లబండగూడెం, రామాపురం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి పట్టుకొని వారిద్దరిని రిమాండ్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోదాడ ఏడీ వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించి ప్రభుత్వ సొమ్మును స్వాధీనం చేసుకున్న రూరల్ సీఐ రజిత రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై అనిల్ రెడ్డిని, సిబ్బందిని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 

Tags:    

Similar News