మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
దిశ, చర్ల : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన కచ్చపల్ లో రెండు రోజుల క్రితం కొత్త క్యాంపు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అక్కడ నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు పనులకు భద్రత నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతర పేలినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో సైనికులు ఘాసీరామ్ మాంఘి, జనక్ పటేల్ లు గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన వారిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించామని ఎస్పీ వివరించారు. ఈఐడీ పేలిన ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.