చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ఇద్దరు అరెస్టు

జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-12-20 09:26 GMT

దిశ,మేడ్చల్ టౌన్ : జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈనెల 10వ తేదీన ముడిచింతలపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి చైన్ స్నాచింగ్ ప్రయత్నించిన విషయం విధితమే. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న షామీర్పేట్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, దాదాపు 70 సీసీ కెమెరాలను పరిశీలించి బండ్లగూడకి చెందిన అంజి రెడ్డి, బోలి గూడెంకు చెందిన నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం కొనసాగించేవారు. ఈజీ మనీకోసం అలవాటు పడి నగర శివారులో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు.

     ఇందులో భాగంగా ఈనెల 10 వ తేదీన మూడుచింతల పల్లికి చెందిన బసవమ్మ (55) రోడ్డు పైన వడ్లు ఆరబోస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీ పైన వచ్చి ఆమె మెడలో ఉన్న 4 తులాల పుస్తెల తాడును చోరీ చేసేందుకు ప్రయత్నించగా దాంతో వృద్ధురాలు ప్రతిఘటించడంతో 5 గ్రాముల బంగారం దోచుకెళ్లారని తెలిపారు. శుక్రవారం వారిని షామీర్పేట్ పరిధిలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి వద్ద నుండి 5.5 గ్రాముల బంగారం, ఒక కారు, ఒక స్కూటీ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అంజిరెడ్డి పై మూడు కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇంత చాకచక్యంగా మేడ్చల్ సీపీఎస్ షామీర్పేట్ పోలీసులు కలిసి నిందితులను పట్టుకున్నందుకు వారికి సీపీ చేతుల మీదుగా రివార్డులు అందజేసినట్లు ఏసీపీ తెలిపారు. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో షామీర్పేట్ సీఐ శ్రీనాథ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గంగాధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ దల్లినాయుడు, ఎస్సైలు హారిక, తదితరులు పాల్గొన్నారు.


Similar News