జంట హత్యల కేసు.. ట్రయాంగిల్ లవ్.. చివరకు మిగిలింది చావు..
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
దిశ, గండిపేట్ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడు అంకిత్ సాకేత్, బిందుకు మధ్య కొద్ది కాలంగా పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఈ నెల 11న బిందును ఎల్బీనగర్ నుంచి నానక్‌రామ్ గూడకు సాకేత్ పిలిపించాడు. అక్కడే తన స్నేహితుడి రూమ్‌లో బిందును ఉంచాడు. మణికొండ మున్సిపల్ పరిధిలోని పుప్పాల్‌గూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్యల కేసులో ట్విస్ట్ బయటపడింది. ట్రయాంగిల్ లవ్, వివాహేతర సంబంధం కారణంగా ఈ జంట దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. మృతురాలు బిందుకు గతంలో వివాహం జరగగా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
భర్త చత్తీస్‌గఢ్‌లో నివాసం ఉండగా బిందు హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసం ఉంటోంది. అయితే మధ్యప్రదేశ్ చెందిన యువకుడు అంకిత్ సాకేత్, బిందుకు మధ్య కొద్ది కాలంగా పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. వీరి ఇద్దరి మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11న బిందును ఎల్బీనగర్ నుంచి నానక్‌రామ్ గూడకు సాకేత్ పిలిపించాడు. అక్కడే తన స్నేహితుడి రూమ్‌లో బిందును ఉంచాడు సాకేత్. ఆ మరుసటి రోజు ఇద్దరు కలిసి పుప్పాల్ గూడ గుట్టల వద్ద ఆ జంట ఏకాంతంగా గడిపింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్‌కు వెలుగులోకి వచ్చింది. అంకిత్ సాకేత్‌కు తెలియకుండా బిందు మరో యువకుడితో ప్రేమాయణం సాగించింది.
ఈ క్రమంలో బిందు, అంకిత్ సాకేత్‌లను మరో ప్రియుడు రెడ్ హ్యాండెండ్‌గా చూశాడు. బిందు, అంకిత్ సాకేత్‌తో కలిసి ఉండడాన్ని సదరు ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు.. ఒక్కసారిగా బిందు పై దాడి చేసి బండరాళ్లతో హత్య చేశాడు. బిందు పై దాడి జరగడాన్ని చూసి భయాందోళనతో పారిపోయేందుకు సాకేత్ యత్నించగా అతడిని కూడా ప్రియుడు పట్టుకుని విచారక్షణా రహితంగా దాడి చేశాడు. తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాల పై బండరాయితో మోదిన ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అంకిత్ పై మిస్సింగ్ కేసునమోదు అవగా.. బిందు పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.
దీంతో అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో హత్యకు గురైంది వీరిద్దరే అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిని హత్య చేసేందుకు హంతకుడికి మరెవరైనా సహకరించారా అనే దాని పై పోలీసులు ఆరా తీస్తున్నారు. హంతకుడి కోసం నార్సింగి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో తన తమ్ముడు కనిపించడం లేదంటూ అంకిత్ సాకేత్ సోదరుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో గచ్చిబౌలి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే వీరి హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.