ఎడ్ల బండ్లపై కలప తరలింపు.. కాపుకాచి పట్టుకున్న అధికారులు
సిరికొండ మండలంలోని సిరిచెల్మా రేంజ్ పరిధిలో గోపాల్ పూర్ అడవి ప్రాంతం నుండి అక్రమంగా టేకు దుంగలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

దిశ, ఉట్నూర్ : సిరికొండ మండలంలోని సిరిచెల్మా రేంజ్ పరిధిలో గోపాల్ పూర్ అడవి ప్రాంతం నుండి అక్రమంగా టేకు దుంగలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ. లక్ష 28 వేలు ఉంటుందని ఉట్నూర్ సబ్ డీఎఫ్ఓ రేవంత్ చంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అడవిని కాపాడేందుకు నిత్యం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకుంటుందని, ముఖ్యంగా సిరిచెల్మ రేంజ్ పరిధిలో అక్రమంగా కలప తరలింపుపై దృష్టి పెట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ పూర్ బీట్ పరిధిలోని అడవిలో 5 ఎడ్ల బండ్లపై టేకు దుంగలను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు కాపు కాసి పట్టుకున్నట్టు తెలిపారు. ఈ కలపను ఇచ్చోడ కలప డిపోకి తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా అడవి నుండి అక్రమంగా కలపను తరలిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడిలో సిరిచెల్మా ఎఫ్ఆర్ఓ స్వామి, ఇంద్రవెల్లి ఎఫ్ఆర్ఓ సంతోష్, సిరికొండ డిప్యూటి ఆర్వో నరేష్, టాస్క్ ఫోర్స్ అధికారి కవిత, వాయిపేట ఎఫ్ఎస్ఓ చంద్రారెడ్డి, టాస్క్ ఫోర్స్, ఎఫ్బీఓలు సజన్ లాల్, శ్యాంసుందర్, అవినాష్, హీరాలల్, విజయ్ కుమార్, సంతోష్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.