కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడిపై దాష్టీకం : వెంటాడి, దాడి చేసి గుండుకొట్టిన వైనం

ఓ యువకుడు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అతడిని వెంబడించి, దాడిచేసి గుండు కొట్టించిన ఘటన ఇందల్వాయి మండలం అన్సాన్ పల్లిలో చోటుచేసుకుంది.

Update: 2023-06-06 15:30 GMT

మొత్తం 16 మందిపై కేసు నమోదు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓ యువకుడు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అతడిని వెంబడించి, దాడిచేసి గుండు కొట్టించిన ఘటన ఇందల్వాయి మండలం అన్సాన్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కే.నందు ఈనెల 1న ఇందల్వాయి మండలం తాను తాగి పడేసిన సిగరేట్ పీకతో స్థానికంగా ఉన్న ఓ రైతు గడ్డి వాము దగ్ధమైంది. ఆ ఘటన పొరపాటున జరిగిందని బాధిత రైతు వదిలేసినప్పుటికీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నందును అకారణంగా తనను వెంబడించి, దాడిచేసి గుండు కొట్టించి అవమానించారు.

అయితే, నందు కథనం ప్రకారం.. తాను కులాంతర వివాహం చేసుకున్నందుకు, పాత కక్షలను మనసులో పెట్టుకొని, పొరపాటున తప్పుకు దొంగతనం ఆపాదించి, కులం పేరిట దూషించి, ఇష్టానుసారంగా కొట్టి గుండు కొట్టించారని నందు ఆరోపించాడు. ప్రస్తుతం బాధితుడు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. గ్రామానికి చెందిన యువకులపై అట్రాసీటీ కేసు నమోదు కావడంతో వీడీసీ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి నిజమని తెలితే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Tags:    

Similar News