గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్, బోయినపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్​ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోయినపల్లి ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.

Update: 2024-11-22 15:23 GMT

దిశ, తిరుమలగిరి : గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్, బోయినపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్​ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోయినపల్లి ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ నారపల్లికి చెందిన ముదసర్, ఆఫ్రిది గత కొంత కాలంగా గంజాయిని విక్రయిస్తున్నారు. వీరు బోయినపల్లికి చెందిన టింకిల్ ఖాన్, ఇజాజ్ లతో పరిచయాలు ఏర్పడ్డాయి.

    ఈ క్రమంలో ఈ నలుగురు కలిసి కొంతకాలంగా బోయినపల్లి శివారులోని కొన్ని ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని గంజాయిని విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం రాత్రి తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో ముదసర్, టింకిల్ ఖాన్, ఇజాజ్ లను అదుపులోకి తీసుకుని విచారించగా తాము నారాపల్లి కి చెందిన ముదసర్, బోయినపల్లి కి చెందిన ఇజాజ్ ల సహాయంతోనే ఆఫ్రిది వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయింస్తునట్లు టింకిల్ ఖన్​ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 300 గ్రాముల గంజాయి, 2సెల్ ఫోన్ లు, 2 పల్సర్ బైక్​లు స్వాధీనం చేసుకుని శుక్రవారం వారిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. 


Similar News