చైన్ స్నాచింగ్ చేసిన దొంగ అరెస్టు

మండలంలోని దేవునిగూడ గ్రామంలో మహిళ మెడలో నుంచి చైన్ చోరీ చేసిన దొంగను గురువారం అరెస్టు చేసినట్లు జన్నారం ఎస్సై గుండెటి రాజవర్దన్ తెలిపారు.

Update: 2024-10-10 10:24 GMT

దిశ,జన్నారం : మండలంలోని దేవునిగూడ గ్రామంలో మహిళ మెడలో నుంచి చైన్ చోరీ చేసిన దొంగను గురువారం అరెస్టు చేసినట్లు జన్నారం ఎస్సై గుండెటి రాజవర్దన్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3వ తేదీన దంతన్ పల్లి గ్రామానికి చెందిన చింతకింది లావణ్య తన భర్తతో కలిసి దేవునిగూడలోని ఓ ఫంక్షన్ కు వచ్చి అక్కడ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రేండ్లగూడ గ్రామానికి చెందిన బి.రాజేందర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడు దొంగిలించాడు. దొంగ వద్ద నుంచి రెండు తులాల పుస్తెలతాడు, పల్సర్ మోటార్ సైకిల్ ను రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై రాజవర్ధన్, సిబ్బంది తుకారం,హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుళ్లను పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు.  

Tags:    

Similar News