కొడుకును హత్య చేసిన తల్లి.. కారణం ఏంటో తెలుసా..?

కన్న బిడ్డను తల్లి హత్య చేసిన ఘటన లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ సమీపంలో గురువారం వెలుగు చూసింది.

Update: 2025-03-20 15:06 GMT
కొడుకును హత్య చేసిన తల్లి.. కారణం ఏంటో తెలుసా..?
  • whatsapp icon

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : కన్న బిడ్డను తల్లి హత్య చేసిన ఘటన లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ సమీపంలో గురువారం వెలుగు చూసింది. కారణం ఏంటని పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఎదురుగడ్డ సమీపంలో నివాసం ఉంటున్న ఎ. దూడమ్మ కొడుకు రాజ్‌కుమార్‌(40) చెట్టంత కొడుకు వృద్ధాప్యంలో అండగా ఉంటాడని తల్లి ఆశలు పెట్టుకుంది. కానీ కొడుకు మాత్రం తాగుడుకు బానిసగా మారి చెడు అలవాట్లతో దారి తప్పాడు. మంచి మాటలతో ఎన్నోసార్లు నచ్చజెప్పింది. అయినా మార్పు రాకపోగా తల్లిని, భార్యను, పిల్లలను మద్యం మత్తులో హింసించ సాగాడు. ఎంత ప్రయత్నం చేసినా కొడుకు తీరు మారలేదు. తాగుడుకు బానిసగా మారిన రాజ్‌ కుమార్‌ బుధవారం రాత్రి తల్లిని, కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టడంతో మానసిక క్షోభను అనుభవించలేక తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. మధ్యం మత్తులో నిద్రిస్తున్న కొడుకు రాజ్‌ కుమార్‌ కాళ్ళు, చేతులు కట్టేసి మెడకు తాడు బిగించి హత్య చేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మీ దేవిపల్లి ఎస్‌హెచ్‌వో రమాణా రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Similar News