గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
నీలిరంగు దుస్తులు ధరించి ఉన్న ఓ మహిళ సరస్సులో తేలియాడుతూ కన్పించిన ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ - జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, జవహర్ నగర్ : నీలిరంగు దుస్తులు ధరించి ఉన్న ఓ మహిళ సరస్సులో తేలియాడుతూ కన్పించిన ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ - జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దమ్మాయిగూడ పరిధికి చెందిన పుల్లగుర్ల అశోక్ రెడ్డి తన గేదెలను తాగునీటి కోసం నాషిన్ సరస్సుకు తీసుకెళ్లాడు.
ఆ సమయంలో అతను 40 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల, సుమారు 5 అడుగుల ఎత్తు, డిజైన్‌తో కూడిన నీలిరంగు చీర, నీలిరంగు జాకెట్‌తో సరస్సులో తేలుతూ ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గమనించాడు. వెంటనే స్థానిక కౌన్సిలర్ నరహరిరెడ్డితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.