కుత్బుల్లాపూర్ రెవెన్యూలో సస్పెండ్ ల అలజడి.. తాజాగా మరో ఇద్దరు వీఆర్ఏలపై వేటు

కుత్బుల్లాపూర్ మండలంలో సస్పెండ్ ల పరంపర కొనసాగుతుంది.

Update: 2023-05-17 15:06 GMT

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మండలంలో సస్పెండ్ ల పరంపర కొనసాగుతుంది. మొన్న వీఆర్ఏ వాసు, నిన్న ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి, నేడు మరో ఇద్దరూ వీఆర్ఏ లు సస్పెండ్ కావడం స్థానికంగా చర్చనీయంశం అవుతంది. మొన్న, నిన్న, నేడు అన్నట్లుగా సస్పెన్షన్ ల చైన్ వెళ్తుండడం కుత్బుల్లాపూర్ గాజులరామారంలో హాట్ టాపిక్ గా మారింది. కుత్బుల్లాపూర్ మండలంలో వీఆర్ఏలుగా దేవా, నాగులు గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం కుత్బుల్లాపూర్ ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కబ్జాదారులకు ఆర్ఐ సహకరించాడనే ఆరోపణలతో ఆర్ఐ సస్పెన్షన్ కు గురయ్యారు.

అంతకు ముందు వీఆర్ఏ వాసు థాయ్ లాండ్ లో క్యాషినో ఆడుతూ పట్టుబడడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సంజీవరావు సస్పెండ్ చేశారు. తాజాగా కబ్జాదారుల నుంచి డబ్బులు తీసుకున్న యూపీఐ పేమెంట్స్ స్క్రీన్ షాట్స్ కొందరు వ్యక్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ సంజీవరావు వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న నాగులు, దేవాను బుధవారం సస్పెండ్ చేశారు.ఇలా రెవిన్యూ అధికారులు, సిబ్బంది సస్పెండ్ ల పరంపరా కొనసాగుతూ పోవడంతో కుత్బుల్లాపూర్ మండలం కార్యాలయంలో ఎం జరుగురుందో అనే ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News