Drugs Seized: న్యూ ఇయర్ వేళ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలో తయారు అవుతోన్న, విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)లను కస్టమ్స్ అధికారులు (Customs officials), నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చెన్నై (Chennai) పట్టణ పరిధిలోని మాధవరం (Madhavaram)లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ (Special Drive) నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కారులో అక్రమంగా డ్రగ్స్ (Drugs) తరలిస్తున్న ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి నుంచి రూ.25 కోట్ల విలువైన 16 కిలోల నిషేధిత ఉత్ప్రేరకాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.