Road Accident: ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఒకరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన హిమాయత్‌సాగర్‌ (Himayath Sagar) ఔటర్ రింగు రోడ్డు (Outer Ring Road)పై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-09-30 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన హిమాయత్‌సాగర్‌ (Himayath Sagar) ఔటర్ రింగు రోడ్డు (Outer Ring Road)పై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అతివేగంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు గాల్లోకి ఎగిరి ఓఆర్ఆర్ (ORR) పైనుంచి కింద పడిపోయింది. దీంతో డ్రైవింగ్ చేస్తు్న్న ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి చెందిన వైద్యుడు నిలయరెడ్డిగా అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం చెట్ల పొదల్లో పడిపోయిన మృతదేహాన్ని పో‌స్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసపత్రికి తరలించారు. అతివేగంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 


Similar News