కొంపముంచిన వాట్సప్ స్టేటస్
వాట్సాప్ స్టేటస్ లో తల్వార్ పట్టుకుని దిగిన ఫొటో పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు అయిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ,ఉప్పల్ : వాట్సాప్ స్టేటస్ లో తల్వార్ పట్టుకుని దిగిన ఫొటో పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు అయిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధు తెలిపిన వివరాల ప్రకారం రామంతాపూర్ బాలకృష్ణ నగర్లో నివసిస్తున్న పడిగేమ్ నాగేశ్వ రరావు (48)సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్ లో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్నాడు.
స్టైల్ కోసం తల్వార్ పట్టుకొని దిగిన ఫొటోను తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. వచ్చిన ఫిర్యాదుపై రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటి) పోలీసులు ఆ ఫొటోను గుర్తించారు. చట్ట విరుద్ధంగా సోషల్ మీడియాలో తల్వార్ పట్టుకున్న ఫొటో పెట్టినందుకు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Also Read...
చుక్కేసి సెక్స్ చేసి.. డిసెంబర్ 31 నైట్ యూత్ హంగామా (వీడియో)