లాడ్జిలో వ్యభిచారం.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు..

వరంగల్ స్టేషన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముగ్గురిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2022-07-27 07:06 GMT

దిశ, హనుమకొండ టౌన్: వరంగల్ స్టేషన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముగ్గురిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ సీఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన తేలు సంపత్ కుమార్ చాలా రోజులుగా శ్రీ వెంకటేశ్వర లాడ్జిలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం అండపల్లి గ్రామానికి చెందిన డెక్క ఎల్లయ్యతో వర్ధన్నపేట శివారు తండాకు చెందిన ఓ మహిళతో ఒప్పందం కుదిర్చి వ్యభిచారం చేయిస్తున్నాడు. పక్కా సమాచార అందడంతో పోలీసులు రైడ్ చేసి మహిళను పంపించి సంపత్ కుమార్, ఎల్లయ్యపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని ఇంతేజార్గంజ్ పోలీసుస్టేషన్ అధికారులకు అప్పగించారు.


Similar News