Prakash Raj : తప్పని.. తప్పుకున్నా : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ప్రకాష్ రాజ్
టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటుల పేర్లు బయటికి రాగా.. వారందరికీ నోటీసులు పంపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ కేసులో టాలీవుడ్ టాప్ నటులైన రానా(Rana), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి (Lakshmi Manchu), అనన్య నాగల్ల ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రచారంపై విజయ్ దేవరకొండ ఇప్పటికే వివరణ ఇవ్వగా.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వంతైంది. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. 2016లో తాను ఆ యాడ్ చేసిన మాట వాస్తవమేనని అని ఒప్పుకున్నారు.
అలాంటి యాడ్ ఎలా చేస్తారని తనని చాలామంది ప్రశ్నించడంతో తన తప్పు తెలుసుకున్నానని వివరించారు. మరుసటి ఏడాదికి ఆ యాడ్ చేయనని వారికి చెప్పేశానని, తర్వాత అలాంటి ప్రమోషన్స్ మళ్ళీ చేయలేదని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ వీడియోను బయటికి తీశారని అందువల్లనే తాను ఈ వివరణ ఇస్తున్నాను అన్నారు. పోలీసుల నుంచి తనకి ఎలాంటి నోటీసులు రాలేదని, నోటీసులు వస్తే వివరణ ఇస్తానని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ తాను ఒక విషయం తెలియజేస్తున్నానని.. గేమింగ్స్ యాప్స్ ఒక వ్యసనం లాంటిదని, ఎవ్వరూ ఈ వ్యసనం బారిన పడకుండా ఉండాలని, జీవితం పాడు చేసుకోవద్దని ప్రకాష్ రాజ్ విన్నవించారు.
READ MORE ...
Vijay Deverakonda: బెట్టింగ్ పెట్టిన ఫిట్టింగ్.. స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్ (పోస్ట్)