కూరగాయలు అమ్మి ఇంటికి వస్తూ.. తిరిగి రాని లోకాలకు..
కల్లూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామం శివారులో కొర్లగూడెం అడ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, కల్లూరు : కల్లూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామం శివారులో కొర్లగూడెం అడ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన జోన్నిబోయిన నాగభూషణం (45) తండ్రి వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనం పై కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
రోజువారి లాగే మంగళవారం కూడా కూరగాయలు అమ్ముకొని తిరిగి తన గ్రామానికి వెళుతున్న తరుణంలో హైదరాబాదు నుంచి వస్తున్న టాటా ఏసీ సత్తుపల్లి వైపుగా వెళుతూ నాగభూషణం ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో నాగభూషణం ఘటన స్థలంలోని మరణించగా పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎస్సై తోట నాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.