Munugodu ASI Attack: రెచ్చిపోయిన మునుగోడు ఏఎస్ఐ.. వృద్ధ రైతుపై దాడి (వీడియో)

ఇద్దరు రైతుల మధ్య జరిగిన వివాదంలో ఎంట్రీ ఇచ్చిన ఓ ఏఎస్ఐ బహిరంగంగానే రైతుపై దాడి చేశాడు. నడీరోడ్డుపై వృద్ధుడని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు.

Update: 2024-10-26 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు రైతుల మధ్య జరిగిన వివాదంలో ఎంట్రీ ఇచ్చిన ఓ ఏఎస్ఐ బహిరంగంగానే రైతుపై దాడి చేశాడు. నడీరోడ్డుపై వృద్ధుడని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. నల్లగొండ జిల్లా మునుగోడు(Munugodu Police Station)లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మునుగోడు మండల కేంద్రానికి చెందిన ముత్యాలు, మరోరైతు భూవివాదంలో గొడవపడ్డారు. దీంతో ముత్యాలుపై ఆ రైతు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మునుగోడు ఏఎస్ఐ కోటి సింగ్(Munugodu ASI Kotisingh)రైతు ముత్యాలును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు వచ్చాడు. అయితే, పొలం పనుల్లో ఉన్నానని తాను తర్వాత స్టేషన్‌కు వస్తానని ఏఎస్ఐతో చెప్పాడు. ఆ సమాధానంతో ఆగ్రహించిన కోటిసింగ్.. నాకే ఎదురు చెబుతావా అంటూ వృద్ధ రైతు ముత్యాలును చితకబాదాడు. కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఏఎస్ఐ శాంతించాడు. వృద్ధుడని కూడా చూడకుండా ఏఎస్ఐ కోటి సింగ్ దాడి చేయడాన్ని కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. ఏఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏఎస్ఐ కోటి సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం ఇలాగేనా అంటూ మండిపడుతున్నారు. 

Tags:    

Similar News