విషాదంలో విషాదం.. అనాథగా మారిన చిన్నారి..

ఓ తల్లి అభంశుభం తెలియని తన చిన్నారి కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Update: 2023-03-04 10:56 GMT

దిశ, నిజామాబాద్ క్రైమ్ : ఓ తల్లి అభంశుభం తెలియని తన చిన్నారితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి పాప తీవ్రగాయాలపాలైంది. పూర్తివివరాల్లోకెళితే నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో గల ఆర్కే ఆర్ అపార్ట్మెంట్ 5 వ అంతస్తు పై నుంచి జటల అనూష (26) తన కూతురు ఆకృతి (1 సంవత్సరం) తో కలిసి శనివారం మధ్యహ్నం దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఈ సంఘటనలో అనూష అక్కడిక్కడే మృతి చెందగా కూతురు ఆకృతి తీవ్రంగా గాయపడింది.

గమనించిన స్థానికులు పాపను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన జటల అనూష భర్త శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జటల అనూషకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం, ఇటీవలే భర్తకూడా చనిపోవడంతో ఆమె తన పెదనాన్న శ్రీనివాస్ ఇంటికి వచ్చినట్టు సమాచారం. భర్త శ్రీనివాస్ చనిపోయినప్పటి నుంచి మనస్థాపానికి గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్ద కూతురుని వదిలేసి చిన్న కూతురుతో సహా ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు తెలిసింది. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.

Tags:    

Similar News