కళాశాలకు వెళ్లిన యువతి అదృశ్యం

కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన గురువారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-11-21 13:07 GMT

దిశ, తిరుమలగిరి : కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన గురువారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయినపల్లి ఎస్సై నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం తాడ్ బంద్ లో నివాసం ఉండే ప్రసయ్య పెద్ద కుమార్తె సుందరగిరి శ్రావణి(24)అనే యువతి బేగంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. రోజు లాగానే శ్రావణి బుధవారం ఉదయం కళాశాలకు వెళ్తున్నానని ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు.

    గురువారం మధ్యాహ్నం వరకు వేచి చూసిన కుటుంబ సభ్యులు స్నేహితులను, బంధువులను ఆరా తీసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. అయితే ఆ యువతి ఓ యువకుడిని పెళ్లి చేసుకున్న ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపించినట్లు ఎస్సై పేర్కొన్నారు. 


Similar News