భారీ అగ్నిప్రమాదం.. నలుగురు బాలికలు సజీవ దహనం
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుడిసెలతో మంటలు వ్యాపించడంతో నలుగురు బాలికలు సజీవ దహనమయ్యారు.
వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌పూర్‌లోని నరేష్‌రామ్ అనే వ్యక్తి గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో గుడిసెలో ఉన్న నరేష్ నలుగురు కూతుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో అది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతుల్లో సోనీ కుమారి (12), శివాని కుమారి(8), అమృత (5), రీటా (3)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలైనట్టు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.