మావోయిస్టుల మరో ఘాతుకం.. ఇన్‌ఫార్మర్ అనే నెపంతో దారుణ హత్య
ఇటీవల కాలంలో దేశంలో మావోయిస్టుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశంలో మావోయిస్టుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. ఓ పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎక్కడో ఒక చోటు మవోయిస్టులు.. తమ ఉనికిని చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్ ఫార్మర్ అనే నెపంతో నిత్యం ఎవరినో ఒకరిని దారుణంగా హత్య చేసి.. అటవీ, గ్రామీణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో గ్రామస్థుడిని దారుణంగా హత్య చేశారు. జంగ్ల అటవీ ప్రాంతంలో ప్రజా కోర్టు నిర్వహించి హత్య చేశారు. ఈ హత్యను భైరం ఘడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు ధ్రువీకరించారు. మృతుడు మత్వారాకు చెందిన మడివి దూలారుగా గుర్తించారు.