పిల్లలు పుట్టడంలేదనే బాధతో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..
పిల్లలు పుట్టడంలేదనే బాధతో మద్యానికి బానిసై పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, కాసిపేట : పిల్లలు పుట్టడంలేదనే బాధతో మద్యానికి బానిసై పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని రేగులగూడలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రేకులగూడకు చెందిన భీంరావుకు పెళ్లై కొన్నేండ్లు అవుతున్నా పిల్లలు పుట్టడంలేదని బాధపడేవారన్నారు.
ఆ బాధతోనే మద్యానికి బానిసయ్యాడని తెలిపారు. మంగళవారం తాగిన మైకంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుని భార్య లక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు దేవాపూర్ ఎస్ఐ విజేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.