ఒకే గదిలో ప్రేమ జంట ఆత్మహత్య..
గోదావరి జిల్లా భీమవరంకు చెందిన ప్రేమికులు ఇద్దరు ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీకాలనీ 7వ ఫేజ్‌లో చోటు చేసుకుంది.
దిశ, కూకట్పల్లి: గోదావరి జిల్లా భీమవరంకు చెందిన ప్రేమికులు ఇద్దరు ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీకాలనీ 7వ ఫేజ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ గోదావరి భీమవరంకు చెందిన ఆకుల శ్యామ్(24), పోతుల జ్యోతి(22)లు కేపీహెచ్‌బీకాలనీ 7వ ఫేజ్‌లోని ఎల్ఐజీ 8లోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. సోమవారం గదిలో పోతుల జ్యోతి విషయం సేవించి ఆత్మహత్యకు పాల్పడగా ఆకుల శ్యామ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గదిలో నుంచి వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఇద్దరు గత కొంత కాలంగా ఇంట్లో నివాసం ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. కాగా ఇద్దరు ఒకే ఊరుకు చెందిన వారు, దగ్గరి బంధువులుగా పోలీసుల విచారణలో తెలిసింది. కాగా జ్యోతి గతంలోనే భర్త నుంచి విడాకులు తీసుకుంది. శ్యామ్‌కు వివాహం కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు ఇంక తెలియరాలేవని తెలిపారు.