Srikakulam KIMS Hospital: కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ కిడ్నాప్‌కు యత్నం
KIMS Hospital Director Escaped from Kidnappers In Srikakulam| శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గూడేన సోమేశ్వర రావును కిడ్నాప్చేసేందుకు దుండగులు యత్నించారు. వైజాగ్ నుంచి వచ్చిన నలుగురు కిడ్నాపర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు
దిశ, ఉత్తరాంధ్ర: KIMS Hospital Director Escaped from Kidnappers In Srikakulam| శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గూడేన సోమేశ్వర రావును కిడ్నాప్చేసేందుకు దుండగులు యత్నించారు. వైజాగ్ నుంచి వచ్చిన నలుగురు కిడ్నాపర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి సమీపాన ఉన్న బ్లెస్ జిమ్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో డాక్టర్ కేకలు వేయడంతో ముగ్గురు కిడ్నపర్లు తప్పించుకున్నారు. ఒకరు మాత్రం స్థానికులకు పట్టుబడ్డాడు. దీంతో నిందితుడిని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాప్ కు గల కారణాలపై ఆరా తిస్తున్నామన్నారు.
పోలీస్ డిపార్ట్ మెంట్లో చీకటి వ్యవహారాలు.. మహిళా హోంగార్డులే టార్గెట్!!