కాళేశ్వరంతో రైతుల కష్టాలు తీర్చిన కేసీఆర్ : ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టుతో రైతుల కష్టాలను తీర్చిన నేత కేసీఆర్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.

Update: 2023-06-07 10:34 GMT

దిశ, కోరుట్ల రూరల్ : కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టుతో రైతుల కష్టాలను తీర్చిన నేత కేసీఆర్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పట్టణ శివారులోని కావేరీ గార్డెన్ లో బుధవారం సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా అధికారులతో సంయుక్తం వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం పుస్తకావిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే అద్భుత ప్రణాళిక నేడు దిగ్విజయమై రాష్ట్రం దేశానికి అన్నంపెట్టే స్థితికి వచ్చిందన్నారు. ఈ విజయం వెనక కేసీఆర్ నిరంతర కృషి, పట్టుదల, ముందుచూపు ఉన్నాయనడం అతిశయోక్తి కాదన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ తో రైతులందరికీ అనువైన వేళల్లో కరెంట్ అందుబాటులో ఉంచి సాగునీటి ఇబ్బందులు తొలగించారన్నారు.

మిషన్ కాకతీయ వంటి పథకాలతో గ్రామ స్థాయిలో నీటి నిల్వలు పెంచడమే కాకుండా, పలు ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో సాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్, ఆర్డీవో వినోద్ కుమార్, జెడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్ ల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ రానవేని సుజాత, నీటి పారుదల ఇంజనీర్ సత్యనారాయణ, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News