గుండె పోటుతో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామనివాసి గాదె రమేష్ రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.

Update: 2024-12-03 04:43 GMT

దిశ, జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామనివాసి గాదె రమేష్ రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. వారు జనగామ వ్యవసాయ శాఖ కమిటీ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News