డబ్బులు తీసిస్తామని దొంగతనాలు..అమాయక ప్రజలే వారి టార్గెట్..!

మేము డబ్బులు తీసి ఇస్తామని చెప్పి ఏటీఎం కార్డులు మార్చి

Update: 2025-01-15 14:17 GMT
డబ్బులు తీసిస్తామని దొంగతనాలు..అమాయక ప్రజలే వారి టార్గెట్..!
  • whatsapp icon

దిశ,షాద్ నగర్ : మేము డబ్బులు తీసి ఇస్తామని చెప్పి ఏటీఎం కార్డులు మార్చి అమాయక ప్రజల అకౌంట్ లలో ఏటీఎం ద్వారా డబ్బులు కొట్టేస్తున్న వారిని షాద్ నగర్ ,శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్ పోలీసులు తెలిపిన బీహార్ ,పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కరిమాన్ సహాని (33), రూప్ దేవ్ సహాని (34), సాహిబ్ సాహిని ( 34) లు ముగ్గురు శంషాబాద్ లో నివాసం ఉంటున్నారు..అయితే వీరు ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి ఏటీఎంల వద్ద మాటు వేసి అమాయక ఏటిఎంలలో డబ్బులు తీయడం రాని అమాయకులను డబ్బులు తీసి ఇస్తామని చెప్పి ఏటీఎం కార్డులను మార్చి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు.

అయితే ఈ నెల 5 వ తేదిన నందిగామ మండలం శ్రీనివాసులు గూడెం కు చెందిన కుమ్మరి రాజు షాద్ నగర్ పట్టణంలోని జడ్చర్ల రోడ్డు లోని ఐడీబీఏం ఏటీఎం సెంటర్ వద్ద డబ్బులు తీయడానికి వెళ్లిన రాజు కు డబ్బులు తీయడానికి రాకపోవడంతో వెనుక నిలబడి ఉన్న తెలుపు షార్ట్ వ్యక్తి డబ్బులు పరిచయం చేసుకుని డబ్బులు తీసి ఇస్తా అని చెప్పి చెక్ చేసినట్లు నటించి ఏటీఎం కార్డు మార్చి ఇచ్చాడని అనంతరం రాజు ఇంటికి వెళ్ళగా మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తన అకౌంట్ లో నుంచి వరుసగా ఐదు సార్లురూ. 42 వేల 400 తీసినట్లు మెసేజ్ వచ్చిందని,వెంటనే రాజు బ్యాంకు కి వెళ్లి అడగగా ఏటీఎం కార్డు నుంచి తీసినట్లు బ్యాంక్ అధికారులు తెలపగా తన ఏటీఎం కార్డు తీసుకున్న వ్యక్తి డబ్బులు తీసాడని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

రాజు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని, వీళ్ళు మొత్తం 15 చోట్ల ఏటిఎం కార్డులు మార్చి డబ్బులు తీశారని,వీరి వద్ద నుండి 2 లక్షల 38 వేల నగదు,140 ఫేక్ ఏటీఎం కార్డులు,4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు..ఈ సమావేశంలో షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్, ఎస్ఓటీ సీఐ సంజయ్ క్రైమ్ డీఐ వెంకటేశ్వర్లు,ఎస్సై శరత్ కుమార్ సిబ్బంది తదితరులున్నారు.


Similar News