Murder Attack : అత్త, భార్య పై వేట కొడవలితో దాడి చేసిన అల్లుడు..
కొన్ని రోజులుగా భార్య కాపురానికి రావడం లేదని అత్త, భార్య పై వేట కొడవలితో దాడి చేసిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
దిశ, దేవరకద్ర : కొన్ని రోజులుగా భార్య కాపురానికి రావడం లేదని అత్త, భార్య పై వేట కొడవలితో దాడి చేసిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. దేవరకద్ర ఎస్సై నాగన్న తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుర్మయ్య భార్య గత కొన్ని రోజులుగా కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో ఆదివారం అత్తింటికి ఆవేశంతో వచ్చిన అల్లుడు కుర్మయ్య దేవరకద్ర మండలం గుడిబండ గ్రామానికి చెందిన అత్త బోయ నిర్మలమ్మ (50), భార్య లక్ష్మమ్మ(30) పై వేట కొడవలితో దాడి చేయడంతో అతని భార్యకు చేతి వేళ్లకు, అత్త నిర్మలమ్మకు తీవ్ర గాయాలు అయి పరిస్థితి విషమించింది. దీంతో పోలీసులు అల్లుడి పై కేసు నమోదు చేశారు. క్షతగాత్రులకు వైద్యం నిమ్మితం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు దేవరకద్ర ఎస్సై నాగన్న తెలిపారు.