శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా భారీగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది.

Update: 2023-05-23 14:57 GMT

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా భారీగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రియాద్ నుంచి (XY- 325) విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీ నిర్వహిస్తుండగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ముగ్గురు ప్రయాణికులపై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్ చేయడంతో వారి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ప్రయాణికులు బంగారం పేస్టును ప్రత్యేకంగా వేసుకున్న షూలకు అడుగు భాగంలో బంగారం పేస్టును అతికించుకొని అక్రమంగా తరలిస్తుండగా ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. కోటి 13 లక్షల 13 వేల 558 ల విలువ చేసే కిలో 818.98 గ్రాముల బంగారం పేస్టు ను స్వాధీనం చేసుకొని ప్రయాణికులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags:    

Similar News