Breaking: అత్యాచారం కేసుపై ఎట్టకేలకు స్పందించిన హర్షసాయి
అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న హర్షసాయి ఎట్టకేలకు స్పందించాడు.
దిశ, వెబ్‌డెస్క్: అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న హర్షసాయి ఎట్టకేలకు స్పందించాడు. బాధితురాలు తనపై తప్పుడు కేసులు పెట్టిందని, కేవలం డబ్బుల కోసమే ఈ ఆరోపణలు చేస్తోందని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అలాగే త్వరలో నిజాలన్నీ బయటకొస్తాయని, తన అడ్వొకేట్ అన్ని వివరాలూ తెలియజేస్తాడని రాసుకొచ్చాడు. అనంతరం తన ఫాలోవర్స్ గురించి మాట్లాడుతూ.. తనేంటో తన ఫాలోవర్స్ అందరికీ తెలుసని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. కాగా.. హర్షసాయి తనని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే హర్షసాయి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెబుతోంది.