శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్..

గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Update: 2023-05-02 13:51 GMT

దిశ. శంషాబాద్: గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం దుబాయ్ నుంచి (EK-526) ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి అతని, లగేజీ బ్యాగును స్కానింగ్ చేయడంతో వారి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ప్రయాణికులు బంగారాన్ని 13 ముక్కలుగా కట్ చేసి చాక్లెట్లలో అమర్చి అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 బంగారం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల వద్ద మొత్తం రూ. 16.50 లక్షల విలువ జేసే 269 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags:    

Similar News