Nirbhaya: దేశ రాజధానిలో మరో నిర్భయ ఘటన.. నెలరోజులు ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన బాధితురాలు (34) నర్సింగ్ చదివి.. కొన్నేళ్లుగా ఢిల్లీలోనే ఉంటోంది. అక్టోబర్ 11వ తేదీ రాత్రి కాలేఖాన్ ప్రాంతంలో ఆటోలో వెళ్తున్న ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో మరో నిర్భయ ఘటన (Nirbhaya Incident) జరిగింది. అక్టోబర్ 11న రాత్రి జరిగిన ఈ దారుణం.. ఆలస్యంగా వెలుగుచూసింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన బాధితురాలు (34) నర్సింగ్ చదివి.. కొన్నేళ్లుగా ఢిల్లీలోనే ఉంటోంది. అక్టోబర్ 11వ తేదీ రాత్రి కాలేఖాన్ ప్రాంతంలో ఆటోలో వెళ్తున్న ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. రాజ్ ఘాట్ (Raj Ghat) సమీపంలో తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహిళను గుర్తించిన నేవీ సిబ్బంది వెంటనే ఎయిమ్స్ ట్రామా సెంటర్లో (Aiims trauma center) చేర్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా.. ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఆ సమయంలో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఏమీ చెప్పలేకపోయిందని, షాక్ లో ఉన్న ఆమెకు వైద్యులు చికిత్స చేశారని పోలీసులు తెలిపారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్న విషయాన్ని పోలీసులు నిర్థారించారు. మహిళ కోలుకున్నాక.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుల కోసం గాలించిన పోలీసులు.. తాజాగా అరెస్ట్ చేశారు. ఆటో నడుపుతున్న ప్రభు, స్క్రాప్ షాపులో పనిచేసే ప్రమోద్, షంఘల్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పోలీసుల కస్టడీలో ఉండగా.. కేసుపై నివేదిక ఇవ్వాలని ఒరిస్సా ముఖ్యమంత్రి ఢిల్లీ పోలీసులను కోరారు.