Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్(Afzal Gunj)లో కాల్పులు కలకలం రేపాయి. ట్రావెల్స్ బస్ క్లీనర్(Travels Bus Cleaner)పై కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్(Afzal Gunj)లో కాల్పులు కలకలం రేపాయి. ట్రావెల్స్ బస్ క్లీనర్(Travels Bus Cleaner)పై కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో క్లీనర్ స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగల ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చిన బీదర్ పోలీసుల(Bidar Police)ను చూసి దుండగులు కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. దుండగులు బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకొని ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.