ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య..
పంట సాగులో ఆశించిన మేర దిగుబడులు రాకపోవడంతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది.
దిశ, ఇచ్చోడ : పంట సాగులో ఆశించిన మేర దిగుబడులు రాకపోవడంతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. స్థానికులు ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామానికి చెందిన దొంగ్రీ జ్ఞానేశ్వర్ (43) తన ఐదెకరాల భూమిలో పత్తి సాగు కోసం అప్పు చేశాడు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై తన వ్యవసాయ చేనుకి వెళ్లి అక్కడే ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు జ్ఞానేశ్వర్ సోదరుడు దేవిదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు.