Drugs Seize: డ్రగ్స్ అమ్ముతున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్.. ఎండీఎంఏ స్వాధీనం
రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన డ్రగ్స్ (Drugs) వినియోగం అందరినీ కలవరపెడుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన డ్రగ్స్ (Drugs) వినియోగం అందరినీ కలవరపెడుతోంది. ఎక్సైజ్ పోలీసులు (Excise Police), తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో (Telangana Anti Narotic Bureau), టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force Police) వరుసగా దాడులు చేపడుతుండగా ఎక్కడో ఒకచోట డ్రగ్స్ (Drugs) పట్టుబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే యువత మత్తుకు బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు కోటి ఆశలతో పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తుంటే.. వారు మాత్రం డగ్స్, గంజాయి మహమ్మరి బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని వనస్థలిపురం (Vanasthalipuram)లో ఓ బీటెక్ చదువుతోన్న బహిరంగంగా డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డాడు. సుష్మ థియేటర్ (Sushma Theater) సమీపంలో ఎక్సైజ్ పోలీసులు (Excise Police) తనిఖీలు చేపడుతుండగా.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న నెల్లూరు జిల్లా (Nellore District)కు చెందిన జాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడి నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ (MDAMA Drug), సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గ్రాము రూ.2,500 చొప్పున కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.