దొంగకు కారు అప్పజెప్పి మెట్రోలో వెళ్లిపోయిన యువకుడు.. అసలు ఏం జరిగిందంటే?
దొంగకు తన కారు అప్పజెప్పి తాను మెట్రోలో ఇంటికి వెళ్లిపోయాడు ఢిల్లీ చెందిన ఓ యువకుడు.
దిశ, వెబ్ డెస్క్: దొంగకు తన కారు అప్పజెప్పి తాను మెట్రోలో ఇంటికి వెళ్లిపోయాడు ఢిల్లీ చెందిన ఓ యువకుడు. ఇంతకు అసలు ఏం జరిగిందంటే? గ్రేటర్ కైలాష్ 2కు చెందిన అమిత్ ప్రకాశ్ అనే వ్యక్తి గోల్ఫో కోర్స్ రోడ్డులోని ఓ ప్రవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే శుక్రవారం ఈవెనింగ్ పని ముగించుకొని అమిత్ ఓ అపరిచితుడితో కలిసి ఫుల్లుగా మద్యం తాగాడు. అనంతరం ఆ అపరిచితుడిని తన కారులో కూర్చోబెట్టుకొని అక్కడ కూడా మద్యం సేవించారు. అయితే అమిత్ ఫుల్లుగా మద్యం తాగి సోయి తప్పడంతో అపరిచిత వ్యక్తి తాను కారును నడుపుతానంటూ స్టీరింగ్ తీసుకున్నాడు. అయితే అలా కొంత దూరం వెళ్లాక సుభాష్ చౌక్ వద్ద అపరిచిత వ్యక్తి తాగిన మైకంలో ఉన్న అమిత్ ను దిగిపోవాల్సిందిగా కోరాడు.
దీంతో ఆ కారు తనదే అని మరిచిన అమిత్ అక్కడి నుంచి దిగి మెట్రోలో ఎలాగోలా తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇక దొంగ కారుతో ఉడాయించాడు. అయితే మరుసటి రోజు జరిగిన విషయాన్ని గ్రహించాడు. వెంటనే సెక్టార్ 65 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తాగిన మైకంలో కారుతో పాటు అందులోని రూ.2 వేల విలువైన వైన్ బాటిల్ ను కూడా దొంగకు అప్పనంగా అప్పజెప్పినట్లు ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా ఐపీసీ సెక్షన్ 319 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.