రాంగ్‌రూట్‌లో రెండు బైకులను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరు మృతి

డీసీఎం డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చి రెండు బైకులను ఢీ కొట్టడంతో

Update: 2025-03-29 08:12 GMT
రాంగ్‌రూట్‌లో రెండు బైకులను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరు మృతి
  • whatsapp icon

దిశ,జహీరాబాద్: డీసీఎం డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చి రెండు బైకులను ఢీ కొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారిలో జహీరాబాద్ కు రాంనగర్ కు చెందిన ఉమేష్(58), సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్త అల్లూరు గ్రామానికి చెందిన శ్రీశైలం(47)లున్నారు. క్షతగాత్రుల్లో ఉమేష్ భార్య ఈశ్వరమ్మ, కొడుకు సిద్ధులున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం కొత్తూరు (డి) గ్రామ సమీపంలో వీ ఎస్టీ క్రాస్ రోడ్డు వద్ద మద్యం మత్తులో ఉన్న డీసీఎం డ్రైవర్ రాంగ్ రూట్ వచ్చి జహీరాబాద్ వైపు నుంచి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వస్తున్న జహీరాబాద్ కు చెందిన ఉమేష్(58) ఢీ కొట్టాడు.

దీంతో ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందగా ఈశ్వరమ్మ అతను కొడుకు సిద్దుకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరో బైక్ పై వస్తున్న సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్త అల్లూరు గ్రామానికి చెందిన శ్రీశైలం(47)ను కూడా ఈ మందు బాబు తన డీసీఎంతో ఢీ కొట్టడంతో ఆయన కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోహీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వరమ్మ, సిద్దును సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News