గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ఆదివారం విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించి

Update: 2024-09-29 15:23 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆదివారం విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులు 133 గంజాయి చాక్లెట్లు (660 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరి ని అరెస్టు చేసి అతనిపై ఎన్‌డీపీఎస్ చట్టంప్రకారం రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో పాల్గొని 133 గంజాయి చాక్లెట్లు (660 గ్రాములు) స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భరత్, రెండవ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్, సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ డా.శంకబ్రత బాగ్చి అభినందించారు.


Similar News