ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..

నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలోని లింగమయ్య కాలనీలో గురువారం ఉదయం ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందాడు.

Update: 2024-12-12 05:34 GMT

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలోని లింగమయ్య కాలనీలో గురువారం ఉదయం ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం బిజినేపల్లి మండలానికి చెందిన బత్తుల రాములు అనూషల కుమారుడు బత్తుల నితిన్ (8) షాప్ కు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీ కొనడంతో బాలుడి తలకు బలంగా గాయలపాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం పై ఎస్సైని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.


Similar News